హోండా కొత్త 'యాక్టివా'.. BS6 ప్రమాణాలతో తొలి స్కూటర్ ఇదే!

హోండా కొత్త యాక్టివా.. BS6 ప్రమాణాలతో తొలి స్కూటర్ ఇదే!
x
Highlights

హోండా కంపెనీ BS6 ప్రమాణాలతో యాక్టివా 125 స్కూటర్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఈ నెలాఖరుకు మార్కెట్ లో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.

హోండా కంపెనీ కొత్త టూవీలర్ విడుదల చేసింది. హోండా యాక్టివా 125 కి అప్ డేటెడ్ వెర్షన్ గా ఈ స్కూటర్ వచ్చింది. BS6 ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో విడుదలైన మొదటి స్కూటర్ ఇదే!

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ స్కూటర్ ను లాంచ్ చేశారు. ఈ స్కూటర్లు త్వరలోనే మార్కెట్ లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇంచుమించు ఈ నెల 29 నుంచి ఈ స్కూటర్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. ఈ స్కూటర్ ధరలు 67,490 రూపాయల నుంచి ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది.

ధర పెరిగింది..

ఈ మోడల్ లో ప్రస్తుతం ఉన్న స్కూటర్ ధర కన్నా ఇది దాదాపు 7 వేల రూపాయలు ఎక్కువగా ఉంది. BS6 ప్రమాణాలతో మార్కెట్ లోకి వస్తున్నా హోండా యాక్టివా 125 స్టాండర్డ్ వేరియంట్ 67,490 రూపాయలు. ఇక అలాయ్ వేరియంట్ ధర 71,000, అలాగే డీలక్స్ వేరియంట్ ధర 74,500గా ఉన్నాయి. ఈ ధరలు అన్ని ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.



కొత్త కొత్త ఫీచర్లు అదిరాయిగా..

స్కూటర్ డిజైన్ విషయానికి వస్తే.. వెహికల్ మోడ్రన్ లుక్‌తో కనిపిస్తోంది. సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ ఎప్రాన్‌పై క్రోమ్ ఇన్‌సర్ట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్, కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ పొజిషన్ ల్యాంప్, బ్లాక్ విండ్‌స్క్రీన్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

అలాగే ఈ కొత్త స్కూటర్‌లో ఎకో స్పీడ్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ (సైడ్ స్టాండ్ తీయకుంటే వెహిల్ స్టార్ట్ కాదు), సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఏసీజీ స్టార్టర్ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. స్కూటర్‌లో 124.9 సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యూయెల్ ఇన్‌జెక్షన్ బీఎస్ 6 ఇంజిన్ ఉంటుంది. కొత్త స్కూటర్ రెడ్, బ్లూ, గ్రే, వైట్ రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories