సరికొత్త మారుతీ ఇగ్నీస్ కారు అదిరింది!

సరికొత్త మారుతీ ఇగ్నీస్ కారు అదిరింది!
x
Highlights

మన దేశంలో మారుతీ సుజుకీ కార్లకు ఉన్న మోజే వేరు. మధ్యతరగతి ప్రజలు మక్కువగా చూసే వాహన శ్రేణి మారుతీ సొంతం. ఇక మారుతి నుంచి కొత్త కారు వస్తోందంటే దాని పై...

మన దేశంలో మారుతీ సుజుకీ కార్లకు ఉన్న మోజే వేరు. మధ్యతరగతి ప్రజలు మక్కువగా చూసే వాహన శ్రేణి మారుతీ సొంతం. ఇక మారుతి నుంచి కొత్త కారు వస్తోందంటే దాని పై అందరి దృష్టీ పడుతుంది. ఇప్పుడు మారుతీ తాజాగా సరికొత్తగా ఇగ్నిస్ కార్లను మార్కెట్లోకి తెస్తోంది. అటో ఎక్స్ పో 2020 లో ఈ కారును ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ కార్లకు ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కానీ, ఇంకా ఈ కార్ల ధరను, లాంచింగ్ ఎప్పుడనే వివరాలను మారుతీ ప్రకటించలేదు. ఈ కారులో రెండు కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి. ఆక్రోపోలిస్, స్కార్చర్ అనే ఆప్షన్లో ఇది లభ్యమవుతుంది.

మారుతీ సుజుకీ 2020 ఇగ్నీస్ లో కొత్తగా రెండు కలర్ ఆప్షన్లు చేర్చారు. కాషాయం, నీలం రంగుల్లో కొత్తగా రావడంతో సరికొత్తగా కనిపించనుంది ఇగ్నీస్. ఇవి కాకుండా నెక్సా బ్లూ, సిల్వర్, గ్రే, తెలుపు రంగుల్లో ఇది లభించనుంది. వీటితోపాటు కొత్త డ్యూయల్ టోన్ సదుపాయలూ ఇందులో ఉన్నాయి. నెక్సా బ్లూ మోడల్ బ్లాక్, సిల్వర్ రూఫ్ తో రానుండగా.. కాషాయం రంగు మోడల్ నలుపు రూఫ్ లో వస్తోంది. ఇక కారు పూర్తి స్థాయి విశేషాలు ఇలా ఉన్నాయి.

బీఎస్6 ఇంజన్..

1.2లీటర్ వీవీటీ పెట్రోల్ ఇంజిన్ తో పనిచేసే ఇగ్నిస్ వాహనం బీఎస్6 నిబంధనలకు అనుగుణంగా రూపొందించారు. ఇది 83హెచ్ పీ పవర్, 113ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ ను కలిగి ఆటోమోటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది.

అదిరిన డిజైన్..

సరికొత్త డిజైన్ లో ఇగ్నీస్ కార్ల ప్రియులను అలరించనుంది. ఎస్ యూవీ స్టైల్ హ్యాచ్ బ్యాక్ తో ఆల్ న్యూ గ్రిల్ తో క్రోమ్ గ్రిల్ యూ స్థానంలో యూ ఆకారంలో ఉన్న మోటీఫ్స్ ను ఈ కారుకు ఉపయోగించారు. ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ ను రీ డిజైన్ చేశారు. ఇక కారు వెనుక భాగం పెద్దగా మార్పులు లేవు. కొద్దిగా బంపర్ డిజైన్ మారింది అంతే. అల్లాయ్ వీల్స్, రూఫ్ రేయిల్స్, రేర్ స్పాయిలర్ లతో ఇగ్నీస్ లుక్ ఆకట్టుకుంటుంది.

ఫీచర్లు ఇలా ..

మారుతీ సుజుకీ ఇగ్నీస్ అంతర్భాగం అధునాతనంగా ఉంది. డ్రైవర్ సీటు కొంచెం ఎత్తుగా నిర్మించారు. సీటింగ్ అరేంజ్ మెంట్ కూడా ఆకట్టుకునేలా ఉంది. కూర్చోడానికి సౌలభ్యంగా ఉంది. మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, 17.78 అంగుళాల స్మార్ట్ ప్లే స్టూడియో టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమోటిక్ ఏసీ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories