Bajaj Chetak: సరికొత్తగా బజాజ్ చేతక్

K V D Varma
Updated on: 16 Oct 2019 3:23 PM IST
Bajaj Chetak: సరికొత్తగా బజాజ్ చేతక్
X

హమారా బజాజ్ అంటూ స్కూటర్ల మార్కెట్ లో బజాజ్ కంపనీని ఒక రేంజిలో నిలబెట్టిన బ్రాండ్ చేతక్. ఇప్పుడు మళ్లీ సరికొత్త హంగులతో వచ్చేస్తోంది. మోటార్ సైకిల్ విభాగంలో దూసుకుపోవడం కోసం చేతక్ స్కూటర్ల తయారీని అప్పట్లో నిలిపివేసింది బజాజ్. ఇప్పుడు మళ్లీ ఆధునిక హంగులతో ఎలక్ట్రిక్ చేతక్ ను తీసుకు వస్తోంది.

బజాజ్ కంపెనీ చాకన్ ప్లాంట్లో తయారు చేస్తున్న తమ స్కూటర్ కు చేతక్ ఎలక్ట్రిక్ అని పేరు పెట్టింది. ఈ పేరు కూడా చాలా కాలం నుంచి రకరకాలుగా వినిపించింది. అయితే, తమకు స్కూటర్ మార్కెట్ లో నెంబర్ వన్ ఇమేజీ తీసుకువచ్చిన చేతక్ పేరుతోనే సరికొత్త స్కూటర్ ను విడుదల చేసింది బజాజ్. ఈ కొత్త స్కూటర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బజాజ్ కొత్త స్కూటర్ ఇటు దేశీయంగా నూ, అటు విదేశాలలోనూ విజయవంతమవుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

ఈ కొత్త స్కూటర్ 2020 జనవరి నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.


K V D Varma

K V D Varma

Next Story