కేవలం రూ.40,000తో నంబర్-1 ఫ్యామిలీ కారు.. 33కి.మీలకు మించి మైలేజీ..!

Maruti Suzki Alto K10: చాలామంది సరసమైన ధరలో ఫ్యామిలీ కారుని కోరుకుంటారు. అలాంటి కారుని అందించే ఏకైక కంపెనీ మారుతి సుజుకి మాత్రమే.

Arun Chilukuri
Updated on: 2 Aug 2023 10:01 PM IST
Maruti Suzki Alto K10 EMI Down Payment Check for all Details
X

కేవలం రూ.40,000తో నంబర్-1 ఫ్యామిలీ కారు.. 33కి.మీలకు మించి మైలేజీ..!

Maruti Suzki Alto K10: చాలామంది సరసమైన ధరలో ఫ్యామిలీ కారుని కోరుకుంటారు. అలాంటి కారుని అందించే ఏకైక కంపెనీ మారుతి సుజుకి మాత్రమే. ఈ కంపెనీ దేశంలోని ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని వారి అవసరాలకి అనుగుణంగా కార్లని సిద్దం చేస్తుంది. మధ్య తరగతి కుటుంబాలకి సరిపోయే మారుతి కారు గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ కారు పేరు మారుతి సుజుకి ఆల్టో కె10. కేవలం రూ. 40,000తో ఈ కారుని ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే దీని మైలేజ్ 33 కిలోమీటర్ల కంటే ఎక్కువగా వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ధర, ఈఎంఐ

మారుతి సుజుకి ఆల్టో K10 ధర రూ.3.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.5.95 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. మీరు ఈ కారు బేస్ వేరియంట్‌ను డౌన్ పేమెంట్‌పై కొనుగోలు చేయాలనుకుంటే ఈఎంఐ తెలుసుకోవడం చాలా అవసరం. ఒకవేళ మీరు ఈ కారును 10% డౌన్ పేమెంట్‌తో బేస్ వేరియంట్‌ కొనుగోలు చేస్తే సుమారు రూ. 40,000 చెల్లించి, 9.5% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల పాటు నెలకి రూ.7,500 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

ఇంజిన్, మైలేజ్

మారుతి ఆల్టో K10కి 1 లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఐదు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇందులో CNG కిట్ ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. దీని కారణంగా ఇంజిన్ 57 PS, 82.1 Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ మోడ్‌లో దీని మైలేజ్ 24.90 కిమీ/లీ వరకు వస్తుంది. అదే సిఎన్‌జితో అయితే కిలోకి 33.85 కిమీ వరకు మైలేజీని అందిస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story