మారుతీ స్విఫ్ట్ 2020 సిద్ధం.. త్వరలోనే భారత్ మార్కెట్లలో!

మారుతీ స్విఫ్ట్ 2020 సిద్ధం.. త్వరలోనే భారత్ మార్కెట్లలో!
x
Highlights

మన దేశంలో కార్ల విషయంలో మారుతీ రూటే సెపరేటు. అందులోనూ మారుతీ స్విఫ్ట్ కారు మన రోడ్ల మీద అందరికీ ఇష్టమైన కారుగా పరుగులు తీస్తోంది. మారుతీ కార్లలో...

మన దేశంలో కార్ల విషయంలో మారుతీ రూటే సెపరేటు. అందులోనూ మారుతీ స్విఫ్ట్ కారు మన రోడ్ల మీద అందరికీ ఇష్టమైన కారుగా పరుగులు తీస్తోంది. మారుతీ కార్లలో స్విఫ్ట్ కు ఉన్న క్రేజే చెప్పలేనంత. ఇప్పుడు త్జాగా మారుతీ సుజుకీ కంపెనీ ఈ స్విఫ్ట్ కారుకు 2020 వెర్షన్ ను తీసుకువచ్చే పనిలో ఉంది. త్వరలోనీ ఈ కారు మన దేశంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈకొత్త మారుతీ స్విఫ్ట్ 2020 కారు జపాన్ లో లాంచ్ చేసింది కంపెనీ. ఇక భారత్ లో లాంచ్ చేయడమే తరువాయి. స్విఫ్ట్ 2020 కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బాహ్య రూపంలో చిన్న చిన్న మార్పులు..

మారుతీ స్విఫ్ట్ 2020 చూడటానికి పాట స్విఫ్ట్ తరహాలోనే ఉంది. కాకపోతే చిన్న చిన్న మార్పులు చేశారు. ముఖ్యంగా బంపర్ కొద్దిగా మారింది. డిజైర్ తరహాలో బంపర్ ఇచ్చారు.గ్రిల్ టైప్ డిజైన్ మధ్యలో క్రోం బార్ అమర్చారు. చూడటానికి ఇది చాలా బావుంది.


మరింత శక్తివంతంగా ఇంజన్..

మారుతీ స్విఫ్ట్ 2020 ఇంజన్ మరింత శక్తివంతంగా.. సమర్ధవంతంగా కనిపిస్తోంది. దీనిలో 1.2 లీటర్ పెట్రోల్ డ్యూయల్ జట్ వెర్షన్ ఏర్పాటు చేశారు. దీనికి ఐడిల్ స్టాప్ - స్టార్ట్ ఫీచర్ కూడా జత చేశారు. ఇకన ఇంతకు ముందు స్విఫ్ట్ 83 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ ఉండేది..ఇప్పుడు ఈ కొత్త స్విఫ్ట్ 2020 లో 90 పీఎస్ పవర్ ప్రొడ్యూస్ ఇంజన్ అమర్చారు. అయితే, టార్క్యూఅవుట్ pu మాత్రం 113 Nm గానే ఉంది. ఇక ఇందులో ఇచ్చిన ఐడిల్ స్టాప్-స్టార్ట్ స్విచ్ తొ ఆటోమేటిక్ గా కారు ఐడిల్ గా ఉన్నపుడు ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ ఎక్సలెటర్ నొక్కితే ఆన్ అయిపోతుంది. ఈ విధానంతో మారుతీ డిజైర్ లో 2kmpl పెట్రోల్ ఆదా గమనించారు. ఇప్పుడు స్విఫ్ట్ 2020 లో కూడా ఈ ఫీచర్ వలన అదేస్థాయిలో పెట్రోల్ ఆదా అవుతుందని భావిస్తున్నారు.


స్మార్ట్ డిస్ప్లే..

ఇక మారుతీ 2020 లో లేటెస్ట్ స్మార్ట్ ప్లే స్టూడియో 7.0 వెర్షన్ టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా 4.2 ఇంచ్ మల్టీ ఇన్ఫర్మేషన్ కలర్ డిస ప్లే డ్రైవర్ ఇన్స్త్రుమెంతల్ క్లస్టర్ గా ఏర్పాటు చేశారు.

మరింత సేఫ్టీ గా..

ఇక భద్రత విషయానికి వస్తే.. స్విఫ్ట్ 2020 మరింత సేఫ్టీ ఫీచర్లతో ఉంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ISOFIX చైల్డ్ సీట్ ఎంకర్స్, రియర్ పార్కింగ్ సేన్సర్స్, EBD తొ కూడిన ABS ఫంక్షనాలిటీ బ్రేకులు ఇచ్చారు. ఇక రివర్స్ పార్కింగ్ కెమెరా.. ముందు భాగంలో ఫాగ్ లంప్స్ అమర్చారు.

మార్పులు లేని క్యాబిన్..

మారుతీ స్విఫ్ట్ 2020 లో పెద్దగా మార్పులు ఏవీ లేవు. ఇంతకు ముందు ఉన్నట్టుగానే అన్నీ ఉన్నాయి.

మొత్తమ్మీద స్విఫ్ట్ 2020 అన్నివిధాలుగానూ కారు ప్రియులను ముఖ్యంగా మారుతీ ప్రియులను ఊరిస్తోందని చెప్పొచ్చు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం మారుతీ కొత్త స్విఫ్ట్ ధరలు (ధిల్లీ ఎక్స్ షోరూం) 5.19 లక్షల నుంచి 8.02 లక్షల వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories