One Lakh Best Bikes: లక్షలోపు సూపర్‌ బైక్‌లు ఇవే.. అందుబాటు ధరల్లో అధిక మైలేజీ..!

One Lakh Best Bikes: భారతదేశంలో బైక్‌ల హవా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉండడం వల్ల వీరు బడ్జెట్‌లో వచ్చే బైక్‌ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు.

Shekhar G
Updated on: 5 Feb 2024 7:00 PM IST
Know About The Best Two Wheeler Under Rs 1 Lakh In India
X

One Lakh Best Bikes: లక్షలోపు సూపర్‌ బైక్‌లు ఇవే.. అందుబాటు ధరల్లో అధిక మైలేజీ..!

One Lakh Best Bikes: భారతదేశంలో బైక్‌ల హవా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దేశంలో మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉండడం వల్ల వీరు బడ్జెట్‌లో వచ్చే బైక్‌ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అందుకే ప్రతి సంవత్సరం బైకుల కొనుగోళ్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఇంటిలో ఒక టూ వీలర్‌ ఉంటుంది. అయితే చాలామంది తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న బైక్‌ కోసం చూస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఒక లక్షలోపు వచ్చే సూపర్‌ బైక్‌ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

హీరో స్ప్లెండర్ ప్లస్

హీరో స్ప్లెండర్ ప్లస్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టూ వీలర్‌. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.75,141. ఇది 3 వేరియంట్లు 6 రంగులలో లభిస్తుంది. ఇది 97.2 cc BS6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 8.02 PS శక్తిని, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ 112 కిలోల బరువు, 9.8 లీటర్ ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది.

హోండా యాక్టివా 6G

హోండా యాక్టివా 6G స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.76,234. ఇది 5 వేరియంట్లు 8 రంగులలో లభిస్తుంది. ఇది 109.51cc BS6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 7.84 PS శక్తిని 8.90 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఇందులో 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది.

సుజుకి యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.79,899. ఇది 4 వేరియంట్లు 15 రంగులలో అందుబాటులో ఉంది. యాక్సెస్ 125 124 cc BS6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 8.7 PS శక్తిని 10 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. సుజుకి యాక్సెస్ 125 బరువు 103 కిలోలు 5 లీటర్ ఇంధన ట్యాంక్ కలిగి ఉంటుంది.

హోండా sp 125

హోండా SP 125 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.86,017. ఇది 3 వేరియంట్లు 7 రంగులలో లభిస్తుంది. SP 125 123.94cc BS6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 10.87 PS శక్తిని 10.9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ముందు వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉంటాయి. హోండా SP 125 బరువు 116 కిలోలు 11.2 లీటర్ల ఇంధన ట్యాంక్‌ను కలిగి ఉంటుంది.

హోండా షైన్ 125

హోండా షైన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.79,800. ఇది 2 వేరియంట్లు 5 రంగులలో లభిస్తుంది. షైన్ 123.94 ccBS6-2.0 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 10.74 PS శక్తిని 11 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 10.5 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది.

Shekhar G

Shekhar G

Next Story