
High Mileage Bikes:150 సీసీ సెగ్మెంట్‌లో అధిక మైలేజీ ఇచ్చే బైక్‌లు ఇవే..!
High Mileage Bikes: దేశంలో టూ వీలర్ మార్కెట్ వేగంగా విస్తరించింది. దాదాపు ఇంటికి ఒక బైక్ అయినా ఉంటుంది.
High Mileage Bikes: దేశంలో టూ వీలర్ మార్కెట్ వేగంగా విస్తరించింది. దాదాపు ఇంటికి ఒక బైక్ అయినా ఉంటుంది. ఇంధన ధరలు పెరుగుతున్నా బైక్‌ల కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడిప్పుడు ఎలక్ట్రిక్ బైక్‌ల కొనుగోళ్లు కూడా జరుగుతున్నాయి. అయితే చాలామంది మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ అలాగే స్టైలిష్‌గా ఉండే బైక్‌లను ఇష్టపడుతున్నారు. వంద సీసీ బైక్‌లు మైలేజీని ఇస్తాయని అందరికి తెలుసు కానీ లుకింగ్‌లో ఇవి అంత స్టైలిష్‌గా ఉండవు. అందుకే చాలామంది 150 సీసీ బైక్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఈ రోజు ఈ సెగ్మెంట్‌లో అధిక మైలేజీ ఇచ్చే బైక్‌ల గురించి తెలుసుకుందాం.
హోండా SP160/యునికార్న్: హోండా ప్రస్తుతం 150-160cc సెగ్మెంట్‌లో యునికార్న్, SP160లను విక్రయిస్తోంది. ఈ రెండు మోడల్స్ ఒకే 162.7cc, సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వస్తాయి. ఈ ఇంజన్ 60kmpl మైలేజీని ఇవ్వగలదు. అయితే SP160లో 65kmpl మైలేజ్ ను కంపెనీ క్లెయిమ్ చేసింది.
టీవీఎస్ అపాచీ RTR 160: టీవీఎస్ అపాచీ RTR 160 159.7cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది 15.82 bhp 13.85Nmని ఉత్పత్తి చేస్తుంది. అపాచీ RTR 160 60kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
బజాజ్ పల్సర్ N160: బజాజ్ పల్సర్ N160 పనితీరుతో పాటు 51.6 kmpl మైలేజీని అందిస్తుంది. పల్సర్ ఎన్160 ధర రూ.1.33 లక్షలుగా ఉంది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 160R: Hero Xtreme 160R 160cc, ఎయిర్-కూల్డ్ ఇంజన్ తో వస్తుంది. ఇది 8,500 rpm వద్ద 15bhp 6,500rpm వద్ద 14Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 49 kmpl మైలేజీని అందిస్తుంది.
బజాజ్ పల్సర్ N150: పల్సర్ N150 శక్తివంతమైన మోడల్. పల్సర్ N160 కంటే తక్కువ మైలేజీని అందిస్తుంది. కొత్త తరం 150cc పల్సర్ 47kmpl మైలేజీని మాత్రమే అందిస్తుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




