Hero EV Surge S32: గంటకు 60 కిమీ వేగం.. త్రీ వీలర్‌లో 2 వీలర్‌.. హీరో నుంచి మల్టీ పర్పస్ వెహికిల్ చూస్తే వావ్ అనాల్సిందే..!

Hero EV Surge S32: హీరో మోటోకార్ప్ త్రీవీలర్ కం టూ వీలర్‌గా పనిచేసే ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది.

Arun Chilukuri
Updated on: 27 Jan 2024 7:01 PM IST
Hero Concept Model Multi Purpose 3 Wheeler EV Surge S32 Check Features and Launch Date
X

Hero EV Surge S32: గంటకు 60 కిమీ వేగం.. త్రీ వీలర్‌లో 2 వీలర్‌.. హీరో నుంచి మల్టీ పర్పస్ వెహికిల్ చూస్తే వావ్ అనాల్సిందే..!

Hero EV Surge S32: హీరో మోటోకార్ప్ త్రీవీలర్ కం టూ వీలర్‌గా పనిచేసే ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసింది. ఇంకా సరళంగా చెప్పాలంటే, మూడు చక్రాల వాహనాన్ని ద్విచక్ర స్కూటర్‌గా కూడా మార్చవచ్చన్నమాట. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. హీరో దీనికి సర్జ్ అని పేరు పెట్టింది.

జైపూర్‌లో జరిగిన హీరో వరల్డ్ 2024లో హీరో సర్జ్ S32 (సర్జ్) మల్టీ-పర్పస్ త్రీ-వీలర్ కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఇది త్రీవీలర్‌గానూ, ఎలక్ట్రిక్ స్కూటర్‌గానూ పని చేస్తుంది. ఈ స్కూటర్‌ని కొన్ని నిమిషాల్లో త్రీ వీలర్‌కి అటాచ్ చేయవచ్చు.

త్రీ-వీలర్ లోపల స్కూటర్..

ఈ వాహనం SURGE S32 సిరీస్. వాస్తవానికి, ఈ కార్గో త్రీవీలర్ లోపల ద్విచక్ర వాహనం లేదా స్కూటర్ దాగి ఉంటుంది. మొదట్లో ఇది మూడు చక్రాల వాహనంగా కనిపిస్తుంది. ఇది ముందు సీటులో ఇద్దరు వ్యక్తులు కూర్చునేందుకు స్థలం ఉంటుంది. కానీ, స్కూటర్ బయటకు వచ్చినప్పుడు సీటింగ్ కెపాసిటీ స్కూటర్ సీటుకు మారుతుంది.

కంపెనీ ప్రకారం, మూడు-చక్రాల నుంచి ద్విచక్ర వాహనంగా మార్చడానికి 3 నిమిషాలు పడుతుంది. S32 PV, S32 LD, S32 HD, S32 FB అనే మొత్తం 4 వేరియంట్‌లను కంపెనీ ఈ సిరీస్‌లో విడుదల చేస్తుంది. S32 LDని హీరో వరల్డ్ 2024లో ప్రదర్శించారు.

సర్జ్..

S32 త్రి-వీలర్, టూ-వీలర్ కోసం వేర్వేరు పారామితులను కలిగి ఉంది. S32 LD మూడు చక్రాల వాహనం సమయంలో అది 10 Kw శక్తిని పొందుతుంది. దీని కోసం ఇది 11 Kwh బ్యాటరీకి కనెక్ట్ అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 45 కిలోమీటర్లు. ద్విచక్ర వాహన పారామితుల పరంగా, ఇది 3 Kw శక్తిని పొందుతుంది. దీని కోసం ఇది 3.5 Kwh బ్యాటరీకి కనెక్ట్ చేయబడింది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story