Bajaj Pulsar N160: బజాజ్ పల్సర్ N160 వచ్చేస్తుంది.. ధర ఎంతంటే..?

Bajaj Pulsar N160: బజాజ్‌ కంపెనీ టూవీలర్‌ సెగ్మెంట్‌ మార్కెట్‌లో తనదైన ముద్రవేసింది. స్పోర్ట్‌ బైకులలో బజాజ్‌ పల్సర్‌కి తిరుగులేదు.

Shekhar G
Updated on: 2 Feb 2024 1:00 PM IST
Bajaj Pulsar N160 Coming Soon Spotted During Testing
X

Bajaj Pulsar N160: బజాజ్ పల్సర్ N160 వచ్చేస్తుంది.. ధర ఎంతంటే..?

Bajaj Pulsar N160: బజాజ్‌ కంపెనీ టూవీలర్‌ సెగ్మెంట్‌ మార్కెట్‌లో తనదైన ముద్రవేసింది. స్పోర్ట్‌ బైకులలో బజాజ్‌ పల్సర్‌కి తిరుగులేదు. కొన్ని సంవత్సరాల నుంచి అత్యధిక విక్రయాలతో ముందు వరుసలో నిలుస్తుంది. ఇప్పటికే బజాజ్‌ పల్సర్ కొత్త కొత్త వేరియెంట్లను ప్రవేశపెట్టింది. తాజాగా బజాజ్ పల్సర్ N160 రాబోతుంది. ఇప్పటికే టెస్ట్‌లో విజయంతమైంది. కంపెనీ త్వరలో ఈ మోటార్‌సైకిల్ వివరాలను వెల్లడిస్తుంది. N160 ఇంజిన్, హార్డ్‌వేర్, ఫీచర్లు, మరెన్నో విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

కొత్త బజాజ్ పల్సర్ N160 పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. దీని డిజైన్ కూడా అలాగే ఉంటుంది. మోటార్‌సైకిల్ ట్యాంక్ ష్రడ్స్, స్ప్లిట్ సీట్లు, అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్, రెండు వైపులా DRLలతో కూడిన సింగిల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, పదునైన డిజైన్ లాంగ్వేజ్‌తో వస్తుంది. దీని గ్రాఫిక్స్ అలాగే ఉంటుంది. అయితే కొత్త బజాజ్ పల్సర్ N160కి తాజా రూపాన్ని అందించడానికి కొత్త పెయింట్ స్కీమ్ వస్తుందని అందరు భావిస్తున్నారు.

ఇంజిన్ స్పెసిఫికేషన్లు

రాబోయే బజాజ్ పల్సర్ N160 164.82cc సింగిల్-సిలిండర్ ఎయిర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 15.6bhp పవర్, 14.6Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ E20 ఇంధనంతో పనిచేసేలా అప్‌గ్రేడ్ అయి వస్తుంది. ఈ ఇంజిన్ 20 శాతం ఇథనాల్ మిక్స్ పెట్రోల్‌తో నడుస్తుంది.

హార్డ్వేర్

కొత్త పల్సర్ N160 ముందు వెనుక వైపున 17-అంగుళాల వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్, LED లైటింగ్, ABSతో రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు మరెన్నో ఉంటాయి. కాల్, మెసేజ్ అలర్ట్‌లతో పాటు ఫోన్ కనెక్టివిటీతో కూడిన కొత్త పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో వస్తుంది. బజాజ్ N 160 త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఇది మునుపటి మోడల్‌తో పోలిస్తే కొంచెం ప్రీమియం ధరతో ప్రారంభమవుతుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.30 లక్షలు. ఇది TVS Apache, Yamaha FZS, Hero Xtreme 160R వంటి ఇతర మోడళ్లతో పోటీపడనుంది.

Shekhar G

Shekhar G

Next Story