Petrol Bunk Scams: పెట్రోల్‌ బంక్‌లో మోసం జరుగుతుందా.. ఇక్కడ కంప్లెయింట్‌ చేయండి..!

Petrol Bunk Scams: ఈ రోజుల్లో పెట్రోల్‌ బంకుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. వాహనదారులు అలర్ట్‌గా ఉండకుంటే నష్టపోతారు.

Shekhar G
Updated on: 14 Aug 2023 8:31 PM IST
Alert To Motorists Complain About Petrol Bunk Scams Here
X

Petrol Bunk Scams: పెట్రోల్‌ బంక్‌లో మోసం జరుగుతుందా.. ఇక్కడ కంప్లెయింట్‌ చేయండి..!

Petrol Bunk Scams: ఈ రోజుల్లో పెట్రోల్‌ బంకుల్లో చాలా మోసాలు జరుగుతున్నాయి. వాహనదారులు అలర్ట్‌గా ఉండకుంటే నష్టపోతారు. అక్కడ పనిచేసే సిబ్బంది కస్టమర్లను బురిడీ కొట్టించి చీటింగ్ చేస్తుంటారు. ఒక్కోసారి తక్కువ పెట్రోల్ కొట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు. మరికొన్ని సార్లు మీటర్ సరిగా సెట్ చేయకుండా పెట్రోల్ కొట్టి డబ్బులు దండుకుంటారు. అందుకే పెట్రోల్ బంకులకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే పెట్రోల్ బంక్‌లో జరుగుతున్న మోసాలపై ఎక్కడ ఫిర్యాదు చేయాలో చాలా మందికి తెలియదు. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.

HP పెట్రోల్ బంక్

మీరు HP పెట్రోల్ బంక్‌లో పెట్రోల్-డీజిల్‌లో ఏదైనా సమస్యను కనుగొంటే HP GAS హెల్ప్‌లైన్ నంబర్ 1800-2333-555కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఇది కాకుండా HP ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా కంప్లెయింట్‌ చేయవచ్చు.

ఇండియన్ ఆయిల్‌

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ గురించి ఫిర్యాదు చేయడానికి ఇండియన్ ఆయిల్ హెల్ప్‌లైన్ నంబర్ 18002333555కు కాల్ చేసి కంప్లెయింట్‌ చేయవచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలనుకుంటే Googleలో ఈ పోర్టల్ https://pgportal.gov.in/కి వెళ్లి కంప్లెయింట్‌ చేయవచ్చు. ఇది కాకుండా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించి కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో ఎవరైనా దోషిగా తేలితే అతనిపై చర్యలు తీసుకుంటారు. భారీ జరిమానా విధిస్తారు. విషయం మరింత తీవ్రమైతే పెట్రోల్ బంక్‌ లైసెన్స్‌ను రద్దు చేస్తారు.

పెట్రోల్ సరైనదేనా లేక కల్తీ ఉందా

ఇది తెలుసుకోవాలంటే పెట్రోల్ సాంద్రత 730 నుంచి 800 మధ్య ఉండాలి. అప్పుడే ఆ పెట్రోల్ మంచిదని అర్థం చేసుకోవాలి. మరోవైపు ఈ సాంద్రత 730 కంటే తక్కువ 800 కంటే ఎక్కువ ఉంటే అది కల్తీకి గురయిందని అర్థం. డీజిల్ సాంద్రత 830 నుంచి 900 మధ్య ఉంటుంది. అప్పుడే ఆ డీజిల్ సరైనదని అర్థం చేసుకోవాలి.

Shekhar G

Shekhar G

Next Story