Maruti WagonR 2023: త్వరలో 2023 మారుతి వ్యాగన్ఆర్.. మైలేజీ, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!
Maruti WagonR 2023: ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి త్వరలో దాని ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్‌ని అప్‌డేట్ చేయనుంది.
Maruti WagonR 2023: త్వరలో 2023 మారుతి వ్యాగన్ఆర్.. మైలేజీ, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!
Maruti WagonR 2023: ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకి త్వరలో దాని ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్ఆర్‌ని అప్‌డేట్ చేయనుంది. కొత్త 2023 మారుతి వ్యాగన్ఆర్ నాలుగు వేరియంట్‌లలో ప్రవేశపెట్టనుంది. ఇందులో Xi, VXi, ZXi, ZXi+ ఉన్నాయి. ఇందులో CNG వెర్షన్ LXi, VXi వేరియంట్‌లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త మారుతి వ్యాగన్ఆర్ రెండు ఇంజన్ ఆప్షన్లలో ఉంటుంది. ఒకటి 1.0 లీటర్, మరొకటి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఈ రెండు ఇంజన్లు BS6 ఫేజ్ II ఉద్గార నిబంధనల ప్రకారం తయారుచేశారు. ఈ హ్యాచ్‌బ్యాక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
2023 మారుతి వ్యాగన్ఆర్ ఫీచర్లు
కొత్త వ్యాగన్ఆర్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 4-స్పీకర్ ఆడియో సిస్టమ్, హిల్-హోల్డ్ అసిస్ట్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్, కీలెస్ ఎంట్రీ, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. భద్రత పరంగా ఈ కారులో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, స్పీడ్ అలర్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్, EBDతో కూడిన ABS, సీట్ బెల్ట్ రిమైండర్, స్టీరింగ్ వీల్ ఉంటాయి.
ఇంజన్, మైలేజ్
ప్రస్తుతానికి దీని 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 67bhp శక్తిని, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 24.35kmpl, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో 25.19kmpl మైలేజీని అందిస్తుంది. అయితే 1.2 ఇంజన్ 90బిహెచ్‌పి పవర్, 113ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 23.56kmpl, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 24.43kmpl మైలేజీని అందిస్తుంది.
కొత్త వ్యాగన్ఆర్‌లో ఉన్న ఈ రెండు ఇంజన్లు డ్యూయల్ వివిటి, డ్యూయల్‌జెట్, ఐడిల్ స్టార్ట్ స్టాప్, కూల్డ్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ టెక్నాలజీతో వస్తాయి. 2023 WagonR CNG గురించి మాట్లాడితే ఇది 1.0L పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. దీని ఇంజన్ సెటప్ గరిష్టంగా 57bhp శక్తిని, 82Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. CNG కిట్‌తో దీని మైలేజ్ 34.05km/kg వరకు పెరుగుతుంది.




