Shani Budha Vakri: శని, బుధుల వక్ర గమనం.. ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టబోతున్నారు.. !

July Shani Budha Retrograde Lucky Zodiac Signs
x

Shani Budha Vakri: శని, బుధుల వక్ర గమనం.. ఈ రాశుల వారు జాక్ పాట్ కొట్టబోతున్నారు.. !

Highlights

Shani Budha Vakri: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెల 2025లో రెండు కీలకమైన గ్రహాల కదలికలు జరగబోతున్నాయి.

Shani Budha Vakri: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెల 2025లో రెండు కీలకమైన గ్రహాల కదలికలు జరగబోతున్నాయి. శనిదేవుడు, బుధుడు ఒకే నెలలో తిరోగమనం చేయడం ఒక ప్రత్యేకమైన సంగతిగా చెప్పుకోవచ్చు. ఈ రెండు గ్రహాల వక్ర గమనం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపనుంది. ముఖ్యంగా జూలై 13న శని మీన రాశిలో తిరోగమనం చేయగా, జూలై 18న బుధుడు తిరోగమనం చెందనున్నాడు. ఈ క్రమంలో మూడు రాశుల వారు అదృష్టాన్ని అందుకునే అవకాశం ఉంది. మరి అవేంటో చూద్దాం.

తులా రాశి

ఈ నెలలో శనీశ్వరుడు, బుధుడు కలయిక వల్ల తులా రాశి వారికి ఆర్థికంగా ఎంతో అనుకూలత కనిపిస్తుంది. ఇప్పటి వరకూ నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తుల వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రువులపై విజయం, పాత సమస్యలకు పరిష్కారం దొరకనుంది. కొత్త ఆర్థిక అవకాశాలు తలుపుతడతాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగ ప్రోమోషన్ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వృషభ రాశి

బుధుడు, శని వక్రగమనం వృషభ రాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు తీసుకురానుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన డబ్బు వచ్చే అవకాశముంది. వ్యాపార రంగంలో లాభాలు వస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు, ప్రమోషన్‌లు, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఇది అనుకూల కాలం. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి.

మకర రాశి

ఈ నెల శని, బుధ తిరోగమనం మకర రాశి వారికి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకురానుంది. ఆకస్మికంగా ఆర్థిక లాభాలు వస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రేమ, దాంపత్య జీవితం శుభంగా మారుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. కొత్త వ్యాపార అవకాశాలు, భవిష్యత్తు ప్లానింగ్‌లో విజయాలు సాధిస్తారు.

ఈ రెండు గ్రహాల తిరోగమనం వల్ల మూడు రాశుల వారికి మంచి సమయం ఆరంభమవుతోంది. మీ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో తెలుసుకోడానికి మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకోవడం మంచిది. జూలై మాసం మీకు శుభఫలితాలు తీసుకురావాలని ఆశిద్దాం!

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్కులు, పంచాంగాలు, నమ్మకాలు, జ్యోతిష్య పండితులు చెప్పిన సమాచారాన్ని మీకు అందించాము. hmtv న్యూస్ దీనిని నిర్ధారించడం లేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories