Baba Vanga Prediction: మయన్మార్‌ భూకంపంతో బాబావంగ జ్యోతిష్యం మరోసారి నిజమైంది.. ఇంకా ఏం జరగనున్నాయి..!

Baba Vanga Prediction Myanmar Earthquake and Whats Next for 2025 and Beyond
x

Baba Vanga Prediction: మయన్మార్‌ భూకంపంతో బాబావంగ జ్యోతిష్యం మరోసారి నిజమైంది.. ఇంకా ఏం జరగనున్నాయి..!

Highlights

Baba Vanga Prediction: కాలజ్ఞాని బాబా వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్ల క్రితమే భవిష్యత్తును అంచనా వేశారు ఆమె.

Baba Vanga Prediction: కాలజ్ఞాని బాబా వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో ఏళ్ల క్రితమే భవిష్యత్తును అంచనా వేశారు ఆమె. కళ్లు కనిపించకపోయినా భవిష్యత్తును అంచనా వేశారు. ఈ క్రమంలోనే తాజాగా అంతర్జాతీయ వ్యవహారాలతో సంబంధించి మరోసారి వార్తల్లో నిలిచారు. యుద్ధాలు, దేశాల మధ్య ఘర్షణలు, రాజకీయాలు, ప్రకృతి విపత్తులపై ఆమె చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. ఇటీవల మయన్మార్‌లో చోటుచేసుకున్న భారీ భూకంపం కూడా బాబా వంగా ముందే భవిష్యవాణి చేసినట్టు చెప్పుకుంటున్నారు. 2025కి సంబంధించిన ఆమె చెప్పిన మరికొన్ని జోస్యాలు నిజమవుతాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మయన్మార్‌లో ఇటీవల జరిగిన భారీ భూకంపం కారణంగా 3,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది గ్రామాలు నాశనమయ్యాయి. ఈ ఘటన బాబా వంగా చెప్పిన భూకంపం గురించి మరింత నమ్మకం కలిగించేలా అనిపించింది. 2025లో భారీ ప్రకృతి విపత్తు సంభవిస్తుందని ఆమె హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ భవిష్యవాణికి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పవచ్చు.

2025లో యూరప్‌లో పెద్ద యుద్ధం జరుగుతుందని కూడా బాబా వంగా ముందే అంచనా వేశారు. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతుండటం, ఇది యూరప్‌లో మరిన్ని సంక్షోభాలను తెచ్చే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. బాబా వంగా ప్రకారం, ఈ యుద్ధం సామాన్య ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. 9/11 దాడులు, ప్రిన్సెస్ డయానా మరణం వంటి ఘటలను ఆమె ముందే చెప్పిన విషయం తెలిసిందే, అందుకే తాజా హెచ్చరికలను చాలా మంది సీరియస్‌గా తీసుకుంటున్నారు. అయితే, యుద్ధం ఏ దేశాల మధ్య జరిగే అవకాశం ఉందని ఆమె చెప్పలేదు.

2025లో ప్రపంచంలో భారీ ఆర్థిక సంక్షోభం జరుగుతుందని కూడా బాబా వంగా పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో, ఈ సంక్షోభం అనేక దేశాలను మాంద్యంలోకి నెట్టివేయగలదని ఆమె ఎప్పుడో అంచనా వేశారు. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీని ప్రభావితం చేసే అంశాలు, ద్రవ్యోల్బణం, ఎనర్జీ సంక్షోషం వంటి వాటి గురించి చాలామంది ఆందోళన చెందుతున్నారు.

బాబా వంగా 2025 తరువాత జరగబోయే మరిన్ని సంఘటనలను కూడా భవిష్యవాణి చేశారు. 2028లో వీనస్ గ్రహంపై ఎనర్జీ శోధనలు ప్రారంభమవుతాయని, 2033లో పోలార్ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతాయని అంచనా వేశారు. ఆమె 2130లో ఏలియన్స్‌తో మనుషుల పరిచయం జరిగే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. 3005లో భూమి మరియు మార్స్ మధ్య యుద్ధం జరుగుతుందని కూడా ఆమె చెప్పినట్లు సమాచారముంది.

ఈ జోస్యాలకు శాస్త్రీయ ఆధారం లేకపోయినా, నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు, నాసా ఇప్పటికే వీనస్‌పై అధ్యయనాలు ప్రారంభించిందని, క్లైమేట్ మార్పుల కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. బాబా వంగా 2043 సంవత్సరానికి సంబంధించి ఒక ముఖ్యమైన జోస్యం ఇచ్చారు, ఇందులో యూరప్ ముస్లిం పాలనలోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సమయానికి ముస్లింలు యూరప్‌లో ప్రముఖ రాజకీయ శక్తిగా మారుతారని, జనాభా, సాంస్కృతిక మార్పులు ఈ పరిణామానికి దోహదం చేస్తాయని ఆమె అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories