Mirror Vastu Tips: అద్దం అందాన్ని చూపిస్తుంది.. ఈ నియమాలు పాటించకపోతే చుక్కలు చూపిస్తుంది..!

Mirror Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు సరైన దిశలో సరైన స్థానంలో ఉండాలి.

Arun Chilukuri
Updated on: 26 Jan 2024 7:01 AM IST
According to Vaastu Take These Precautions Regarding Mirror at Home
X

Mirror Vastu Tips: అద్దం అందాన్ని చూపిస్తుంది.. ఈ నియమాలు పాటించకపోతే చుక్కలు చూపిస్తుంది..!

Mirror Vastu Tips: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు సరైన దిశలో సరైన స్థానంలో ఉండాలి. లేదంటే పాజిటివ్‌కు బదులు నెగిటివ్‌ ఫలితాలు ఎదురవుతాయి. ఈ విషయంలో అద్దం చాలా ముఖ్యమైంది. దీనిని సరైన దిశ, స్థలంలో పెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రంలో అద్దానికి సంబంధించి అనేక నియమాలు పేర్కొన్నారు. చాలా మంది ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటారు. కానీ వాస్తు పండితులు ఈ విషయంపై పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి అద్దానికి సంబంధించిన వాస్తు చిట్కాలను ఈ రోజు తెలుసుకుందాం.

ఇంట్లో అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా పెట్టకూడదని గుర్తుంచుకోండి. ఇది ఇంట్లోని శాంతిని నాశనం చేస్తుంది. పాజిటవ్‌కు బదులు నెగిటివ్‌ ఎనర్జీని ప్రేరేపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో అద్దం పెట్టుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా మంచం అద్దంలో కనిపిస్తే వెంటనే దాన్ని అక్కడి నుంచి తొలగించండి. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరగుతుంటాయి. ఒకవేళ మీరు దానిని తీసివేయలేకపోతే పడుకునేటప్పుడు అద్దాన్ని క్లాత్‌లో కప్పి ఉంచండి.

ఇంట్లో ఎప్పుడూ పగిలిన అద్దం ఉండకూడదు. ఇది అశుభమైనదిగా చెబుతారు. ఉదయం నిద్రలేచిన వెంటనే పగిలిన అద్దం కనిపించడం వల్ల రోజంతా కష్టాలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వంటగదిలో పొరపాటున అద్దం పెట్టకూడదు. దీంతో కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇల్లు లేదా ఆఫీసులో తూర్పు దిశలోని ప్రధాన ద్వారంపై అద్దం పెట్టడం శ్రేయస్కరం. ఈ ప్రదేశంలో ఒక రౌండ్ అద్దం పెడితే అది ఉదయించే సూర్యుడిని సూచిస్తుంది. ఈశాన్య గోడపై అమర్చిన అద్దం పురోగతిని తెస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story