Porumamilla: రేషన్ షాపులను తనిఖీ చరిసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, తహశీల్దార్

గ్రామంలోని రేషన్ షాపులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, తహసీల్దార్ అయూబ్ ఖాన్ పరిశీలించారు.

S. Srikanth
Published on: 31 March 2020 5:10 PM IST
Porumamilla: రేషన్ షాపులను తనిఖీ చరిసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, తహశీల్దార్
X

పోరుమామిళ్ల: గ్రామంలోని రేషన్ షాపులను వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున రెడ్డి, తహసీల్దార్ అయూబ్ ఖాన్ పరిశీలించారు. ఉచితంగా బియ్యం ,కందిపప్పు సక్రమంగా ఇస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 14వ తారీకు వరకు సరుకులు ఇవ్వడం జరుగుతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, రెండవ విడతగా 16 నుండి మళ్లీ ఇవ్వడం జరుగుతుందని, కరోనా వైరస్ వల్ల ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఇళ్ల నుండి బయటకు రావద్దని కరోనాకు మందు లేదు అని నివారణ ఒక్కటే మార్గం అని అన్నారు.

ప్రజలందరూ సహకరించాలని ఏప్రిల్ 4న 1000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందని ఒక నెలలో రెండుసార్లు రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఎమ్మెల్సీ డి.సి గోవింద్ రెడ్డి అన్నారు. ప్రజలకు నిత్యవసర వస్తువులు సక్రమంగా అందే విధంగా చూస్తున్నారని పారిశుద్ధ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story