విజయసాయిరెడ్డి సంచలనం.. టీడీపీని వీడేది ఎవరో? 19న తెలుస్తుంది..

Raj
By Raj
Published on: 12 Jun 2020 11:44 AM IST
విజయసాయిరెడ్డి సంచలనం.. టీడీపీని వీడేది ఎవరో? 19న తెలుస్తుంది..
X

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. టీడీపీని వీడేదెవరో ఈనెల 19న తేలుతుందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో ఇలా పేర్కొన్నారు.. భోగాలు మీవి త్యాగాలు బిసి, ఎస్సీ, ఎస్టీలవా? అంటు టీడీపీని ప్రశ్నించారు. రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారని..

బలం లేక ఓడే టైంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారని వ్యాఖ్యానించారు. 19 నాడు టీడీపీ బలం ఎంతో, వెంట ఉండేది, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ , గుంటూరు ఈస్ట్ నుంచి గెలిచిన మద్దాలి గిరిధర్, చీరాలనుంచి గెలిచిన కరణం బలరాంలు ఇప్పటికే టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీకి మద్దతు పలికారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి జంపింగ్ ల అంశం చర్చకు వచ్చింది.

Raj

Raj

Next Story