వైసీపీకి వరుసగా షాక్‌లు.. పార్టీ వీడేందుకు సిద్ధమైన కీలక నేత..

Mopidevi Venkataramana: వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 29 Aug 2024 10:53 AM IST
వైసీపీకి వరుసగా షాక్‌లు.. పార్టీ వీడేందుకు సిద్ధమైన కీలక నేత..
X

వైసీపీకి వరుసగా షాక్‌లు.. పార్టీ వీడేందుకు సిద్ధమైన కీలక నేత..

Mopidevi Venkataramana: వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత మోపిదేవి బాటను ఎంచుకున్నారు. నిన్న ఆమె రాజీనామా చేశారు.

వైసీపీ కీలక నేతలు మరికొందరు పార్టీని వీడుతారనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా పత్రాలిచ్చే అవకాశం ఉంది. వైసీపీ నుంచి టీడీపీ, బీజేపీ, జనసేనలో త్వరలో చేరికలు ఉండనున్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు కొందరు వైసీపీ ఎంపీలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

ఇవాళ మోపిదేవితో పాటు ఒకరిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందని.. అయితే టీడీపీలో చేరాలంటే గెలిచిన పార్టీకి రాజీనామా చేసి రావాలంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక గత ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు చేయని వారికే.. టీడీపీలో సముచిత స్థానం ఉంటుందని చంద్రబాబు వారికి చెప్పినట్లు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story