Lella Appireddy Arrest: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌

Lella Appireddy Arrest: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

Arun Chilukuri
Updated on: 5 Sept 2024 5:25 PM IST
Lella Appireddy Arrest
X

Lella Appireddy Arrest: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌

Lella Appireddy Arrest: వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్‌లో మాజీ మంత్రి జోగి రమేశ్ కోసం గాలిస్తున్నారు ఏపీ పోలీసులు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో జోగి రమేష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేయడంతో.. ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగి రమేష్‌తో పాటు దేవినేని అవినాష్‌, వారి అనుచరుల కోసం హైదరాబాద్‌లో మూడు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు ఏపీ పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో ఎయిర్‌పోర్టులను అలర్ట్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story