ఆయన జూమ్ కి.. ఈయన ట్విట్టర్ కే పరిమితం : అంబటి

ఆయన జూమ్ కి.. ఈయన ట్విట్టర్ కే పరిమితం : అంబటి
x
Highlights

Ambati Rambabu: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు విచిత్రంగా తయారయ్యారు....

Ambati Rambabu: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు విచిత్రంగా తయారయ్యారు. హైదరాబాద్ నుంచి కదలడు, జూమ్ నుంచి బయటికి రాడు, లోకేష్ ట్విట్టర్ వదలడు. వాళ్లిద్దరూ ఏపీకి ప్రవాసులు. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ విఫలమైంది. ఏపీలో అసలు ప్రతిపక్షమే లేదు అని అంబటి అన్నారు. ఏపీలో ప్రతిపక్షాన్ని ప్రజలు ఎప్పుడో దూరంగా పెట్టారన్నారు. దళితులపై దాడులు జరిగితే తమ ప్రభుత్వం తాట తీస్తుందని హెచ్చరించారు. ఎవరినీ వదలిపెట్టబోమని హెచ్చరించారు. ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా ప్రకటనలు మానుకుని ఇకనైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని అంబటి రాంబాబు కోరారు.

అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ నమోదైన పిల్‌పై ఆయన స్పందించారు. నేను అక్రమ మైనింగ్ చేస్తున్నానని పిల్ వేశారు. ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపినా, లేక సీబీఐతో విచారణ జరిపించినా దేనికైనా నేను సిద్ధం అన్నారు అంబటి. తనపై వేసిన పిల్ వేసిన వారు మైనింగ్ దొంగలన్న ఆయన తనపై కేసు వేసినవారితోపాటూ మరో ఐదుగురిపై కేసు నమోదైందని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానన్న అంబటి తన నియోజకవర్గంలో ఎలాంటి అవకతవకలూ జరగలేదన్నారు. అధికారులు, తనను బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశంతో కేసులు వేశారనీ నిరాధార ఆరోపణలకు తాను భయపడేది లేదన్నారు అంబటి.

Show Full Article
Print Article
Next Story
More Stories