వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలోకి మరో కీలక నేత..?

ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపార్టీ నేతలు అధిష్టానానికి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 19 Sept 2024 11:21 AM IST
YSRCP Leader Samineni Udayabhanu Will Likely To Join Janasena
X

వైసీపీకి మరో బిగ్ షాక్.. జనసేనలోకి మరో కీలక నేత..?

ఏపీలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపార్టీ నేతలు అధిష్టానానికి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారం క్రితం ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా జగన్ సొంత బంధువు బాలినేని వైసీపీకి రాజీనామా చేయటంతో పార్టీకి భారీ షాక్ తగిలింది. రాజీనామా బాటలోనే పలువురు సీనియర్లు కీలక నేతలు ఉన్నట్టు తెలుస్తుంది.

జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే జనసేనలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లా నుంచి పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

వైసీపీకి గుడ్ బై చెప్పి కూటమి ప్రభుత్వంలో చేరాలనుకునే వారికి ఇటు కూటమి నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. వైసీపీ నుంచి వచ్చే నేతలను కూటమిలో చేర్చుకోవద్దని పలువురిని టీడీపీ వ్యతిరేకిస్తుండగా మరికొందరి చేరికను జనసేన వ్యతిరేకిస్తున్నట్టు గ్రౌండ్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో పార్టీలో కొత్తవారిని చేర్చుకోవడానికి ఇరువురు సుముఖంగా లేనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరు పార్టీలో చేరినా మూడు పార్టీల నేతల నిర్ణయం తర్వాతే చేర్చుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story