జనసేన ఎమ్మెల్యే మీటింగ్‌కు వైసీపీ నేత.. ఆ జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

కోనసీమ జిల్లా రాజోలులో పొలిటికల్ హీట్ రాజుకుంది. మలికిపురంలోని ఓ ఫంక్షన్ హాలులో ఎన్డీయే కూటమి కార్యకర్తల సమావేశాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమావేశం నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Oct 2024 4:46 PM IST
జనసేన ఎమ్మెల్యే మీటింగ్‌కు వైసీపీ నేత.. ఆ జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్..
X

కోనసీమ జిల్లా రాజోలులో పొలిటికల్ హీట్ రాజుకుంది. మలికిపురంలోని ఓ ఫంక్షన్ హాలులో ఎన్డీయే కూటమి కార్యకర్తల సమావేశాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రత్యక్షమయ్యారు. టీడీపీలో రాపాక చేరుతారనే ఊహాగానాలకు ఊతమిచ్చినట్లు అయింది. గతంలోనూ ఓ సారి జనసేన కార్యక్రమానికి రాపాక వరప్రసాద్ వెళ్లారు.

తాజాగా మరోసారి కలవడంతో ఏంటి విశేషం అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కాగా... ఏనాడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. నాడు అధికారంలో ఉన్న వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. రాజోలు ఎమ్మెల్యేను కలవడంతో పార్టీ మార్పు ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story