Pulivendula: వైసీపీ నేత కొండారెడ్డి అరెస్ట్

Konda Reddy: కడప జిల్లా పులివెందుల వైసీపీ నాయకుడు కొండారెడ్డి అరెస్ట్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 9 May 2022 4:12 PM IST
YSRCP Leader Konda Reddy Arrested
X

Pulivendula: వైసీపీ నేత కొండారెడ్డి అరెస్ట్

Konda Reddy: కడప జిల్లా పులివెందుల వైసీపీ నాయకుడు కొండారెడ్డి అరెస్ట్ అయ్యారు. చక్రాయపేట మండలం వైసీపీ ఇంచార్జీగా కొండారెడ్డి వ్యవహరిస్తున్నారు. పులివెందుల రాయచోటి మార్గంలో జరుగుతున్న పనులను కొండారెడ్డి అడ్డుకోవడంతో పాటు, SRK కాంట్రాక్టర్ ను కొండారెడ్డి బెదిరించారు. కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొండారెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడిని ఈ ఉదయం 11గంటల ప్రాంతంలో అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లె కోర్టులో హాజరుపరిచినట్లు కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో కడప జైలుకు తరలించినట్లు ఆయన వివరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story