కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా!

కె.హెచ్. బాబు
Published on: 20 July 2019 7:08 AM IST
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా జక్కంపూడి రాజా!
X

ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా రాజానగరం ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా నియమితులు కానున్నారు. ఇప్పటికే సీఎం జగన్ కాపు కార్పొరేషన్‌కు చైర్మన్‌గా జక్కంపూడి పేరును ఖరారు చేశారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. అయితే ముందుగా ఈ పదవికి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేరును జగన్ పరిశీలించారు. దాడిశెట్టి తనకు కాపు కార్పొరేషన్ పదవి ఇపుడు వద్దని చెప్పడంతో వెనువెంటనే ఆ పదవికి జక్కంపూడి రాజా పేరును జగన్ ఫైనలైజ్ చేశారు. రాజానగరం నుంచి మొదటిసారి అసెంబ్లీకి పోటీచేసి అత్యధికంగా 32వేల మెజారిటీతో గెలిచిన రాజా మొదటి నుంచి జగన్‌కు సన్నిహితులు.

కె.హెచ్. బాబు

కె.హెచ్. బాబు

Next Story