Top
logo

YSR Pellikanuka: పేదింటి ఆడపిల్లల‌కు 'వైఎస్సార్ పెళ్లి కానుక'‌

YSR Pellikanuka: పేదింటి ఆడపిల్లల‌కు వైఎస్సార్ పెళ్లి కానుక‌
X

Ysr Pellikanuka: how To Apply For Ysr Pellikanuka And Eligibility, Full Details

Highlights

YSR Pellikanuka: పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే .. ఆ కుటుంబానికి ఎంతో భారంగా మారుతోంది. పెళ్లి చేయాలంటే.. బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, మండపం ఇలా అనేక వాటికి ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది

YSR Pellikanuka: పేదింటి ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే .. ఆ కుటుంబానికి ఎంతో భారంగా మారుతోంది. పెళ్లి చేయాలంటే.. బంగారు తాళిబొట్టు, నూతన వస్త్రాలు, భోజనాలు, మండపం ఇలా అనేక వాటికి ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అప్పులు చేసి, వాటిని తీర్చలేక జీవితాంతం సతమతమ ప‌డాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్ సర్కార్ పెళ్ళి కానుక పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు, వివాహం రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వధువుకి రక్షణ కల్పించేందుకు వైఎస్సార్ పెళ్లి కానుక రూపకల్పన చేసింది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఇలా ఉన్నాయి.

దరఖాస్తు వివరాలు:

- మండల సమాఖ్య/మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

- అనంతరం అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.

- వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లి కుమార్తె బ్యాంక్ ఖాతాలో వేస్తారు.

- వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.

- అనంతరం వివాహ దృవీకరణ పత్రం ఇస్తారు.

వైఎస్సార్ పెళ్లి కానుక ప్రోత్సాహకం

- ఎస్సీలకు సాంఘిక సంక్షేమ శాఖ-40,000/-

- ఎస్సీ కులాంతర చేసుకున్న వారికీ సాంఘిక సంక్షేమ శాఖ-75,000/-

- గిరిజనులకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి -50,000/-

- బిసీలకు బీసీ సంక్షేమ శాఖ-35,000/-

- బిసీ కులాంతర వివాహం చేసుకున్న వారికీ బిసి సంక్షేమ శాఖ నుండి -50,000/

- వైఎస్సార్ పెళ్లి కానుక (dulhan) మైనార్టీ సంక్షేమ శాఖ-50,000/-

- దివ్యాంగులకు దివ్యాంగుల సంక్షేమ శాఖ నుండి -1,00,000/-

- వైఎస్ఆర్ పెళ్లి కానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు, ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ-20,000/-

అర్హతలు:

- వివాహానికి 15 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలి.

- వధువు, వరుడు ఇద్దరూ ప్రజాసాధికార సర్వేలో నమోదై ఉండాలి.

- ఏపీ రాష్ట్ర నివాసితులై ఉండాలి.

- వివాహం ఏపీలోనే చేసుకోవాలి.

- ఇద్దరికీ ఆధార్‌కార్డు, వధువు తప్పనిసరిగా తెల్లరేషన్‌కార్డు కలిగి ఉండాలి.

- వధువు బ్యాంకు ఖాతాకు ఆధార్‌ అనుసంధానం చేసి ఉండాలి.

- వివాహ తేదీ నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

- తొలిసారి వివాహం చేసుకునే వారు మాత్రమే పథకానికి అర్హులు.

- వరుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడైనా వధువు ఏపీకు చెందినట్లయితే పథకానికి అర్హులే.

కావాల్సిన‌ డాక్యుమెంట్స్

1. కులము - కమ్యూనిటీ మరియు జనన దృవీకరణ పత్రము.

2. వయసు - ఎస్ఎస్సి సర్టిఫికెట్ 2004 వ సంవత్సరం, ఆ తర్వాత పదవ తరగతి పాస్ అయిన వారికి(లేదా) డేట్ ఆఫ్ బర్త్(లేదా) ఆధార్ కార్డ్.

3. ఆదాయము (వధువు కి మాత్రమే) - తెల్ల రేషన్ కార్డు/ఇన్కమ్ సర్టిఫికెట్.

4. నివాసం - ప్రజా సాధికారిక సర్వే నందు నమోదు/హౌస్ హోల్డ్ సర్వే.

5. అంగవైకల్యం - సదరం సర్టిఫికెట్ ( కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)

6. వితంతువు - ఆధార్ నెంబర్ ఆధారముగా ఫించన్ డేటాతో పరిశీలిస్తారు.

వితంతువు అయ్యుండి పింఛన్ పొందకపోతే లేదా పించన్ డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత దృవీకరణ.

7. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు - ఎ.పి.బి.ఓ.సి.డబ్ల్యూ. డబ్ల్యూ.బి. చే జారీ చేయబడిన కార్మికుల యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డ్.

Web TitleYsr Pellikanuka: how To Apply For Ysr Pellikanuka And Eligibility, Full Details
Next Story