ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డా వైఎస్ఆర్ కంటి వెలుగు అమలు కొరకు జిల్లాలో ఎంపికైన తొమ్మిది మండలాలలో బి కోడూరు మండలం వుండడం చాలా సంతోషదాయకమని మండల ప్రత్యేక అధికారి మొగిలిచెండు సురేశ్ అన్నారు.

S. Srikanth
Published on: 16 Feb 2020 2:34 PM IST
ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం
X

బి కోడూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డా వైఎస్ఆర్ కంటి వెలుగు అమలు కొరకు జిల్లాలో ఎంపికైన తొమ్మిది మండలాలలో బి కోడూరు మండలం వుండడం చాలా సంతోషదాయకమని మండల ప్రత్యేక అధికారి మొగిలిచెండు సురేశ్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 18 నుంచి బి కోడూరు మండలంలో ప్రారంభమయ్యే డా వై ఎస్ ఆర్ కంటి వెలుగు గురించి ఆరోగ్య శాఖాధికారులు మరియు గ్రామ వాలంటీర్లకు అవగాహన సమావేశం బి కోడూరు ఉపాధి కార్యాలయం లో నిర్వహించారు. అలాగే అరవై సంవత్సరాలు దాటిన వారందరికీ కంటి వెలుగు కింద సమగ్ర కంటి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story