AP News: హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె సునీత

సీబీఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Aug 2024 1:11 PM IST
YS Vivekas Daughter Meets Home Minister Anitha
X

AP News: హోంమంత్రి అనితను కలిసిన వివేకా కుమార్తె సునీత

YS Sunitha: ఏపీ సచివాలయానికి వెళ్లారు వైఎస్ వివేకా కుమార్తె సునీత. హోంమంత్రి అనితతో భేటీ అయ్యారు. సెక్రటేరియట్‌లోని రెండో బ్లాక్ చాంబర్‌లో అనితతో సమావేశమయ్యారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సీబీఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు.

ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సంపూర్ణ సహకారం ఉంటుందని అనిత భరోసా ఇచ్చారు. దోషులకు శిక్షపడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్న అనిత, తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టమని స్పష్టం చేశారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story