YS Sharmila: జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే..

YS Sharmila: మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 8 Nov 2024 6:06 PM IST
YS Sharmila Slams Jagan Over his Decision not to Attend Assembly Sessions
X

YS Sharmila: జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే..

YS Sharmila: మాజీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లని వారు ఎవరైనా రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. జగన్ అయినా.. వైసీపీ ఎమ్మెల్యేలైనా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఈనెల 11 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని జగన్ ప్రకటించడంపై షర్మిల తీవ్ర స్థాయిలో స్పందించారు.

మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన షర్మిల మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి వెళ్లే దైర్యం లేకపోతే పదవుల్లో ఉండటం ఎందుకని ప్రశ్నించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి వెళ్లి ఏం మాట్లాడగలం అంటూ జగన్ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు షర్మిల చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story