YS Sharmila: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఆగ్రహం

YS Sharmila: ఏపీ అభివృద్ధికి నోచుకోకుండా అల్లాడుతుంది

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Sept 2024 5:11 PM IST
YS Sharmila is angry with the coalition government
X

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఆగ్రహం

YS Sharmila: మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా అల్లాడుతుంటే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కనీసం అది గుర్తుందా అని ప్రశ్నించారు. కల్తీ నెయ్యి వివాదంపై సీఎం చంద్రబాబు శాంతి హోమాలు, పవన్ ప్రాయశ్చిత దీక్ష, అటు వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళన పూజలు చేస్తున్నారని విమర్శించారు.

ఒకరిమీద ఒకరు పోటీ పడి నీచమైన మత రాజకీయాలకు తెరలేపారంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. మత ఘర్షణలు క్రియేట్ చేయాలనే హిడెన్ అజెండా ఏమైనా పెట్టుకున్నారా అని ఆమె ఘాటుగా ప్రశ్నించారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story