YS Sharmila: జగన్ అసలు మనకి రాజధాని లేకుండా చేశారు

YS Sharmila: సీపీఐ, సీపీఎం నేతలతో విడివిడిగా సమావేశమైన షర్మిల

Jyothi
Published on: 23 Feb 2024 11:54 AM IST
YS Sharmila Comments On Jagan
X

YS Sharmila: జగన్ అసలు మనకి రాజధాని లేకుండా చేశారు

YS Sharmila: విజయవాడలో కాంగ్రెస్, వామపక్ష పార్టీల సమావేశం ముగిసింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల నేతలు చర్చించారు. అయితే రెండు పార్టీలు కలిసి ప్రజాపోరాటాలు చేయాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మాట్లాడారు. పదేళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే హోదా వచ్చేదన్నారామె... మోడీ పదేళ్లు హోదా ఇస్తామని తిరుపతిలోనే ప్రకటించారని, నేటికీ మన హక్కుల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు..

చంద్రబాబు కూడా నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని.. మంత్రి పదవులు తీసుకున్నారని, హోదా కాదు.. ప్యాకేజీ అని సరిపెట్టారని ఎద్దేవా చేశారు. హోదా తెస్తాం.. నాకు అధికారం ఇవ్వండని జగన్ అన్నారని, కానీ అసలు మనకి రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు షర్మిల... కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని‎, పార్టీ ఆఫీస్‌లో రాత్రి ఉండి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.. తమ పోరాటానికి సీపీఎం, సీపీఐ నేతలు మద్దతు ఇచ్చారని చెప్పారు.

Jyothi

Jyothi

Next Story