Idupulapaya: వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన జగన్‌, షర్మిల

YSR Ghat: ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు.

Arun Chilukuri
Published on: 8 July 2024 12:39 PM IST
YS Jagan, Sharmila Pay Tributes At YSR Ghat
X

Idupulapaya: వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన జగన్‌, షర్మిల

YSR Ghat: ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ భారతి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.

వైఎస్‌ఆర్‌ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, భర్త అనిల్ కుమార్, కుమారుడు, కోడలు, కుమార్తెతో కలిసి అక్కడికి వెళ్లారు. జగన్ వెళ్లిన అరగంట తర్వాత ఆమె వైఎస్‌ఆర్‌ ఘాట్‌కు వచ్చారు.

వైఎస్సార్ 75వ జయంతి అందరికీ పండగ రోజనీ.. మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. కోట్లాది కుటుంబాలు ఇవాళ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకుంటున్నాయన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం తమకు శిరోధార్యం అన్నారు. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ.. చేసిన కఠోరశ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మార్గమని ట్వీట్ చేశారాయన.

వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా మంగళగిరిలో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో వైఎస్ జయంతి సభలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story