Nellore: కేసీఆర్ డైరెక్షన్ లో సీఎం జగన్ పనిచేస్తున్నారు: కోటంరెడ్డి

Nellore: కేసీఆర్ డైరెక్షన్ లో సీఎం జగన్ పనిచేస్తున్నారు: కోటంరెడ్డి
x
కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో సీఎం జగన్ పనిచేస్తూ... రాష్టాన్ని సర్వ నాశనం చేస్తున్నారని నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు.

నెల్లూరు: తెలంగాణ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లో సీఎం జగన్ పనిచేస్తూ... రాష్టాన్ని సర్వ నాశనం చేస్తున్నారని నుడా మాజీ ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విమర్శించారు. ఈ మేరకు శనివారం టిడిపి జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఏపీని మూడు ప్రాంతాలుగా విడగొట్టి ఏర్పాటు వాదానికి సీఎం జగన్ బీజం వేశాడని ఆరోపించారు.

ప్రజల ముసుగులో వైసీపీ గుండాలే చంద్రబాబును అడ్డుకున్నారని... రాష్టానికి దశ దిశ చూపిన వ్యక్తిని మూడు గంటల పాటు వ్యాన్ లో కూర్చునపెట్టి పోలీసులు నాటకం ఆడారని అన్నారు. పోలీసుల తీరు కూడా చాలా అభ్యంతరకరంగా ఉందని... కావాలనే టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ పాలన విశాఖకు వస్తుందనే అక్కడి ప్రజలు భయపడుతున్నారని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories