ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం.. ఇద్దరు ఖరారు..

MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు.

Arun Chilukuri
Updated on: 17 Feb 2023 10:15 AM IST
YS Jagan Hold Meeting Selection on MLC Candidates
X

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం.. ఇద్దరు ఖరారు..

MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల్లో సామాజిక వర్గాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థులపై నేతలతో జగన్ చర్చించనున్నారు. నిన్న వైసీపీలో చేరిన వెంకటరమణకు, కుడిపూడి సూర్యనారాయణకు ఎమ్మెల్సీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా 14 స్థానాల్లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ల ప్రకటించిన వైసీపీ.. 9 స్థానిక సంస్థల స్థానాలకు ఇద్దరిని ఖరారు చేశారు. మిగిలిన ఏడుగురు అభ్యర్థులపై సీఎం నేడు నిర్ణయం తీసుకోనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story