YS Jagan: సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవెన్‌ లేదు.. అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది

YS Jagan: 4 నెలల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 2 Oct 2024 7:47 PM IST
YS Jagan Comments On NDA Government
X

YS Jagan: సూపర్‌ సిక్స్‌ లేదు.. సూపర్‌ సెవెన్‌ లేదు.. అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది

YS Jagan: చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్‌గా వైసీపీ అధినేత జగన్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 4 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. విద్య, వైద్య-ఆరోగ్యం, వ్యవసాయ రంగాలతో పాటు అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలిందన్నారు. రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ పరిపాలన కొనసాగుతోందని.. వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.

తాడేపల్లిలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. చంద్రబాబు మోసాలపై ఆగ్రహంతో ఉన్న ప్రజల తరుపున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడి పని చేసేవారికే ప్రాధాన్యత దక్కుతుందని చెప్పారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story