YS Jagan: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోండి

YS Jagan: విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టండి

Dhatripriya
Published on: 12 May 2023 7:52 AM IST
YS Jagan About Amaravati Lands Distribution
X

YS Jagan: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు తీసుకోండి

YS Jagan: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల మొదటి వారంలో గుడివాడలో 8 వేల912 టిడ్కో ఇళ్ల పంపిణీకి సిద్ధంచేస్తున్నామని అధికారులు తెలిపారు.. రెండో విడతకు సంబంధించి 1 లక్ష 12 వేల092 ఇళ్లను సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్యకాలంలో లబ్ధిదారులకు అందిస్తామని వివరించారు. విశాఖపట్నంలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. విజయవాడ కృష్ణానది రిటైనింగ్‌ వాల్‌ పొడవునా రివర్‌ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

Dhatripriya

Dhatripriya

Next Story