తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న  వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
x
Highlights

తిరుమల శ్రీవారిని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు.

తిరుమల, శ్యామ్ నాయుడు

తిరుమల శ్రీవారిని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు వచ్చిన ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయనకు టీటీడీ ఉన్నతాధికారులు దగ్గరుండి స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు, అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించిన ఆయనకు, రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం అధికారులు శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలను అందజేశారు. అర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రరాష్ట్రం త్వరగా కోలుకొని సర్వతోముఖాభివృద్ధి కావాలని, ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని విజయసాయిరెడ్డి వేడుకున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories