వైసీపీ ఎంపీ చెప్పిన అన్న వైఎస్స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆసక్తికర విషయాలు

వైసీపీ ఎంపీ చెప్పిన అన్న వైఎస్స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఆసక్తికర విషయాలు
x
Highlights

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజకీయాలు వెడెక్కాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజకీయాలు వెడెక్కాయి. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. షోకాజ్ నోటీసులు అందుకున్న ఆయ‌న అనంత‌రం సమాధానంగా రాసిన లేఖ‌లో అన్న వైఎస్స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (Anna ysr congress) గురించి ప్రస్తావించారు. అయితే అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎవ‌రిది అనే చ‌ర్చ అంద‌రి మ‌దిలో మెదిలింది. అస‌లు ఆయ‌న అన్నట్లు ఆపార్టీ అనేది ఉందా అని అనుకున్నారు.

అన్న వైఎస్స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వివరాల కోసం ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు తెలిసాయి. ఈ పార్టీ వ్యవస్థాపకుడు కూడా కడప జిల్లాకు చెందిన వ్యక్తి ఆ పార్టీని స్థాపించ‌డం విశేషం. అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ(ఏవైసీపీ).. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (YSRCP)రిజిస్టర్ కావడానికి 3 నెలల ముందే ఆ పార్టీ గుర్తింపు పొందిందని తెలుస్తోంది. కడప కు చెందిన మహబూబ్ బాషా అన్న వైఎస్స్ ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారు. బాషా తనకు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని పిలవడానికి హ‌క్కు ఉందంటున్నారు. అసలైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తనదే అని బాషా అంటున్నారు. వైఎస్సార్‌ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ అన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మాత్రమేనని అంటున్నారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఈ పార్టీని వెలుగుల‌కి తీసుకురావ‌డం వెనుక‌ రాజకీయ వ్యూహం ఏదైనా ఉందా అనే చర్చ మొద‌లైంది. అంతేకాదు ఆ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా మీడియా ముందుకు రావడం ఆసక్తికరంగా మారింది. గ‌తంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా త‌న‌దే అంటూ వ్య‌క్తి కేసు వేసిన సంగ‌తి తెలిసిందే.

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై అనుచితవ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీనిపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. అయితే నోటీసును అందుకున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దీనిపై ఘాటు రిప్లై ఇచ్చారు. విజయసాయరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ అందిందని పేర్కొంటూ అందులో మెలిక పెట్టారు. పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్సా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయా? అంటూ ఫైర్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉంటే.. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. అలాగే మా పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని వైసీపీ కాదని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories