షోకాజ్ నోటీసుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు రచ్చ..!

షోకాజ్ నోటీసుపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు రచ్చ..!
x
Highlights

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై...

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆ పార్టీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలపై అనుచితవ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీనిపై వారంరోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించింది. అయితే నోటీసును అందుకున్న వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దీనిపై ఘాటు రిప్లై ఇచ్చారు. విజయసాయరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీస్ అందిందని పేర్కొంటూ అందులో మెలిక పెట్టారు.

పార్టీ పేరు వైఎస్సార్ కాంగ్రెస్సా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీయా? అంటూ ఫైర్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఉంటే.. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారంటూ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. అలాగే మా పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని వైసీపీ కాదని ఎద్దేవా చేశారు.

వైసీపీ లో క్రమశిక్షణ సంఘం ఉందా..క్రమశిక్షణ సంఘానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా..? సంఘం మినిట్స్ ఉంటే నాకు పంపండి.. క్రమశిక్షణ సంఘం చైర్మన్, సభ్యులు ఏవరు..? విజయసాయిరెడ్డి కి ప్రశ్నల వర్షం కురిపించిన ఎంపీ రఘురామకృష్ణం రాజు..

కొంత కాలంగా వైఎస్సార్సిపి పార్లమెంట్ సభ్యుడు రఘు రామ కృష్ణంరాజు వ్యవహారం పార్టీలో అలజడి సృష్టిస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ఆయన పార్టీని ధిక్కరిస్తూ మాట్లాడారని ఆరోపిస్తూ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది పార్టీ. అయితే, దీనికి సమాధానం ఇస్తానని నిన్న ప్రకటించిన రఘురామా కృష్ణం రాజు ఈరోజు సమాధానానికి బదులుగా ప్రశ్నలు సంధించడం విశేషం!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories