బాలయ్య మానసిక స్థితి బాగోలేదు.. చంద్రబాబు జూమ్ బాబు.. వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు

బాలయ్య మానసిక స్థితి బాగోలేదు.. చంద్రబాబు జూమ్ బాబు.. వైసీపీ ఎమ్మెల్యే విమర్శలు
x
YCP MLA koramutla srinivasulu(File photo)
Highlights

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి గురించి గతంలోనే డాక్టర్లు చెప్పారని గుర్తు చేశారు. బాలకృష్ణ మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తున్నట్లు ఎమ్మెల్యే కోరుముట్ల వెల్లడించారు.

బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడని ఎమ్మెల్యే కోరుముట్ల అన్నారు. హిందూపురం ప్రజలు బాలకృష్ణ వ్యవహార శైలితో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారని వ్యాఖ్యానించారు. దివంగత మాజీ సీఎం, సినీనటుడు ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణపై అందరికీ అభిమానం ఉందన్నారు. కానీ, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిసిన చంద్రబాబును భుజాన మోస్తున్నారని, చంద్రబాబు చచ్చిన పాములాంటివాడని కొరుముట్ల విమర్శించారు.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ ఏడాదిలోనే దేశంలో అత్యంత పాపులర్ పొందిన నాయకుడిగా పేరుతెచ్చుకున్నారని అన్నారు. చంద్రబాబు జూమ్ బాబుగా మారిపోయారని కోరుముట్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రానున్న నాలుగేళ్లలో మరిన్ని అద్భుతాలు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories