Penukonda: టీడీపీ నేతల పై మండి పడ్డ వైసీపీ నేతలు

నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో ఎన్నికల్లో దౌర్జన్యాలు, బెదిరింపులతో గెలిచేందుకు టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం జడ్పిటిసి అభ్యర్థి అశోక్ కుమార్ తెలిపారు.

admin1
Published on: 18 March 2020 9:19 AM IST
Penukonda: టీడీపీ నేతల పై మండి పడ్డ వైసీపీ నేతలు
X
YCP Leaders fires on the TDP Leaders

పెనుకొండ: నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో ఎన్నికల్లో దౌర్జన్యాలు, బెదిరింపులతో గెలిచేందుకు టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వెంకటరత్నం జడ్పిటిసి అభ్యర్థి అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం సోమందేపల్లి లోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు టిడిపి జడ్పిటిసి అభ్యర్థి చంద్ర తమ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి ప్రచారంలో పాల్గొనకుండా బెదిరింపులకు దిగడం తగదన్నారు. దాదాపు 25 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ కుల వర్గ రాజకీయాలతో వెనుకబడిపోయిన పెనుకొండ నియోజక వర్గాన్ని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి శంకర్ నారాయణలు అభివృద్ధి పరిచేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకపోవడంతోనే గడిచిన ఎన్నికల్లో టిడిపిని ప్రజలు మండలంలో చిత్తుగా మెజార్టీ ఇవ్వకుండా ఓడించారని అన్నారు.



admin1

admin1

Next Story