Yatra 2 Teaser: యాత్ర-2 మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్

Yatra 2 Teaser: ఏపీ సీఎం జగన్ పాదయాత్ర ఆధారంగా మూవీ

Jyothi
Updated on: 5 Jan 2024 3:20 PM IST
Yatra-2 Movie Teaser Released by Makers
X

Yatra 2 Teaser: యాత్ర-2 మూవీ టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్

Yatra 2 Teaser: ఏపీ సీఎం జగన్ పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న యాత్ర-2 మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా కనిపించారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలను.. అప్పట్లో జగన్ ఏ విధంగా ఫేస్ చేశారనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో పలువురు ప్రముఖ నేతల క్యారెక్టర్స్‌ను కూడా చూపించారు. సోనియాగాంధీని పోలిన పాత్ర.. అప్పట్లో జగన్ విషయంలో ఎలా వ్యవహరించారనే అంశాలను యాత్ర 2లో చూపించారు. ఇక ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు పాత్ర కూడా యాత్ర 2లో కనిపిస్తోంది.

యాత్ర సినిమాలో రాజశేఖర్ రెడ్డిగా కనిపించి మెప్పించిన మమ్ముట్టి చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చంద్రబాబు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలైన యాత్ర సినిమా అప్పట్లో వైసీపీకి పొలిటికల్ మైలేజీని తీసుకురావడంలో హెల్ప్ అయ్యింది. ఇక యాత్ర 2 సినిమా సైతం మరోసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే విడుదల కానుండటంతో.. ఈ మూవీ అధికార వైసీపీకి మరోసారి పొలిటికల్ మైలేజీ ఇస్తుందా అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.


Jyothi

Jyothi

Next Story