సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ వెంకట్రావు
మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ... వంశీ రాకపై తీవ్ర అభ్యంతరం చెప్పారు.
yarlagadda vennkat rao
వైసీపీలో గన్నవరం పంచాయతీ ముగిసింది.వల్లభనేని వంశీ రాకను యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పంచాయతీ ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు చేరింది. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి సీఎం జగన్‌ను కలిసిన యార్లగడ్డ వంశీ రాకపై తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయితే, రాజకీయ భవిష్యత్తుపై జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడంతో యార్లగడ్డ మెత్తబడినట్లు తెలుస్తోంది. దాంతో, జగన్‌తో మీటింగ్ ముగిసిన తర్వాత పేర్ని నాని, కొడాలి నాని, యార్లగడ్డ వెంకట్రావు ఒకే కారులో బయటికి వెళ్లారు. అయితే, గన్నవరం పంచాయతీకి ముగింపు పలకడంతో... వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి.
Next Story




