YS Jagan: మూడో రోజు పులివెందులలో జగన్ టూర్

YS Jagan Mohan Reddy: పార్టీ కార్యకర్తలు, నేతలు, ప్రజలతో జగన్ భేటీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 24 Jun 2024 9:31 PM IST
Y S Jagan tour in Pulivendula on the third day
X

Y S Jagan: మూడో రోజు పులివెందులలో జగన్ టూర్

YS Jagan Mohan Reddy: కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందామని.. మంచి రోజులు వస్తాయని వైసీపీ శ్రేణులకు జగన్ భరోసా ఇచ్చారు. పులివెందులలో జగన్ మూడో రోజు పర్యటన చేశారు.

పులివెందులలోని భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో జగన్ మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు.

ప్రతీ కార్యకర్తకు వైసీపీ తోడుగా ఉంటుందన్నారు. కష్ట కాలంలో కార్యకర్తలకు అండగా నిలబడాలని నేతలకు జగన్ సూచించారు. ఎవరూ అధైర్య పడొద్దని... రాబోయే కాలం మనదే అన్నారు.

ప్రతి కుటుంబానికి మంచి చేశామన్నారాయన. ప్రజలకు మనపట్ల విశ్వాసం ఉందన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story