Eluru: సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలి

S. Srikanth
Published on: 15 April 2020 10:11 PM IST
Eluru: సామాజిక దూరం పాటిస్తూ పనులు చేసుకోవాలి
X

ఏలూరు: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ను మార్కెట్ యార్డ్ చైర్మెన్ మంచెం మైబాబు ఈ రోజు ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిమ్మకాయల ఎగుమతులు దిగుమతుల ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం నిమ్మకాయ ధర అనుకున్నంతగా లేదని తెలిపారు.

యార్డులో రౌతులు, వ్యాపారులు, కార్మికులు సామాజిక దూరం పాటిస్తూ విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని... అలాగే మార్కెట్ నందు ఎవరికి కరోనా వైరస్ ప్రభావం సోకకుండా డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ను కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story