మహిళా వాలంటరీలు ఎమ్మెల్యే శంబంగికి సన్మానం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా భద్రతకు సంభందించిన బిల్లును శాసనసభ సమావేశాలలో ప్రవేశ పెట్టారు.

S. Srikanth
Published on: 14 Dec 2019 3:46 PM IST
మహిళా వాలంటరీలు ఎమ్మెల్యే శంబంగికి సన్మానం
X
ఎమ్మెల్యే శంబంగి

బొబ్బిలి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళా భద్రతకు సంభందించిన బిల్లును శాసనసభ సమావేశాలలో ప్రవేశపెట్టి ఆమోదించి బిల్లును చట్టం చేసినందుకు మహిళా భద్రతకు మేలు చేకూర్చారని, బొబ్బిలి పట్టణంలోని 20, 25, 26 వ వార్డు వాలంటీర్లు ఒమ్మి రామారావు, చుక్క నరేష్ ఆధ్వర్యంలో బొబ్బిలి వైసీపీ కార్యాలయానికి వచ్చి శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుని సన్మానించారు.

అనంతర జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమములో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాల్ నాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇంటి గోపాల్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షులు సావు కృష్ణమూర్తి, మాజీ కౌన్సిలర్ రేజేటి విశ్వేశ్వర్ రావు సంభందిత వార్డు నాయుకులు ఒమ్మి మహాలక్ష్మి, కన్నూరు శ్రీను, వంగపండు శ్రీరాములు నాయుడు, బొద్దల సత్యన్నారాయణ, బంటు కృష్ణమూర్తి, రాయులు, పూడి జగదీశ్ మరియు వైసీపీ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story