Vizag: ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగుబాటు..

Vizag: విశాఖలో ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

Arun Chilukuri
Published on: 18 Nov 2021 5:33 PM IST
Woman Maoists Surrenders Before Vizag Police
X

Vizag: ఇద్దరు మహిళా మావోయిస్టులు లొంగుబాటు..

Vizag: విశాఖలో ఇద్దరు మహిళా మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎస్పీ కృష్ణారావు ఎదుట మహిళా మావోయిస్టులు తాంబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లచ్చి అలియాస్ శైలు లొంగిపోయారు. వీరిరువురూ పలు సంఘటనలలో, నేరాలలో నిందితులుగా ఉన్నారు. పెదబయలు దళానికి చెందినటువంటి ఇద్దరు మహిళా మావోయిస్టులు అనేక నేరాల్లో పాల్గొన్నారని ఎస్పీ కృష్ణారావు తెలిపారు.

అనారోగ్య కారణాలతో పాటు ప్రజల నుండి, మావోయిస్టులకు ఆదరణ లభించకపోవడంతో లొంగిపోయారన్నారు. ఇద్దరు మహిళా మావోలకు ప్రభుత్వ పరంగా వచ్చే చెరో లక్ష రూపాయలు రివార్డుతో పాటుగా ఇళ్ల స్థలం, వ్యవసాయ భూమిని కూడా అందిస్తామని ఎస్పీ కృష్ణారావు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story