Vijayawada: రన్నింగ్ ట్రైన్‌ నుంచి కాలువలోకి దూకేసిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ట్రైన్ నుంచి ఓ మహిళ కాలువలోకి దూకింది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Nov 2024 10:38 AM IST
Representational Image
X

Representational Image

Vijayawada: విజయవాడ రైల్వే స్టేషన్‌కు సమీపంలో ట్రైన్ నుంచి ఓ మహిళ కాలువలోకి దూకింది. తెనాలికి చెందిన తున్నీషా కదులుతున్న రైలు నుంచి బందరు కాలువలోకి దూకింది. అయితే కాలువ ఒడ్డున చెట్లకంపలో పడి ఉండడంతో నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా అక్కడే ఆగిపోయింది. కాగా విజయవాడ పూలమార్కెట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

తెల్లవారుజామున అటుగా వెళ్తోన్న కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కొబ్బరిమట్టల సాయంతో ఆ మహిళను బయటకు లాగి రక్షించారు. అయితే రాత్రంతా కాల్వలోనే ఉండిపోవడంతోనే శరీరమంతా పాచిపట్టేయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆ మహిళ కాలువలోకి ఎందుకు దూకిందనే కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story