Tirupati: భార్యను చంపి సూట్ కేసులో పెట్టి చెరువులో పడేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. భార్యను చంపి మిస్సింగ్ కేసు నమోదు చేసిన నాటకానికి తెరపడింది.

Arun Chilukuri
Published on: 31 May 2022 1:27 PM IST
Tirupati: భార్యను చంపి సూట్ కేసులో పెట్టి చెరువులో పడేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
X

Tirupati: భార్యను చంపి సూట్ కేసులో పెట్టి చెరువులో పడేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్

Tirupati: తిరుపతి జిల్లా రేణిగుంటలో దారుణం జరిగింది. భార్యను చంపి మిస్సింగ్ కేసు నమోదు చేసిన నాటకానికి తెరపడింది. మహిళ డెడ్‌బాడీ వెంకటాపురం చెరువులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు గాలింపు చేపడుతున్నారు. సత్యనారాయణపురానికి చెందిన వేణుగోపాల్‌తో కొర్లకుంటకు చెందిన పద్మకు వివాహమైంది. కొంత కాలంగా భార్యభర్తల మధ్య వివాదం నెలకొనడంతో విడాకుల కోసం వేణుగోపాల్ ప్రయత్నాలు చేశాడు. కుదరకపోవడంతో వేణుగోపాల్ కొన్ని నెలల క్రితమే హత్య చేసి ఆపై మృతదేహాన్ని దాచిపెట్టే యత్నం చేశాడు. ఈ క్రమంలో భార్య పద్మ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అల్లుడి ప్రవర్తనలో మార్పును గమనించిన పద్మ తల్లి ఈనెల 27న ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసకొని తమదైన శైలిలో విచారించడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో ఈస్ట్ పోలీసులు మృతదేహం దాచి ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లి గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక మిస్సింగ్ కేసును హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story