Nimmala Rama Naidu: బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు ఎందుకు పూర్తి చేయలేదు

Nimmala Rama Naidu: బెజవాడ ముంపుకు జగన్ చేసిన పాలన కారణం కాదా?

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 Sept 2024 9:30 PM IST
Why is Budameru Diversion Channel work not completed?
X

Nimmala Rama Naidu: బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు ఎందుకు పూర్తి చేయలేదు

Nimmala Rama Naidu: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. విజయవాడ వరదలకు జగనే కారణంటూ రామానాయుడు మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం ఏపీని పూర్తిగా నాశనం చేసింది. 2020లో వైసీపీ సర్కారు 198 పనులను పూర్తిగా రద్దు చేసింది. రద్దు చేసిన వాటిలో బుడమేరుకు సంబంధించిన 5 పనులు కూడా ఉన్నాయి. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులను చంద్రబాబు 80 శాతం కంప్లీట్ చేశారు. బుడమేరు బెజవాడకు దు:ఖదాయిని అని తెలిసి చంద్రబాబు ఆ పనులను ప్రారంభించారు. మిగిలిన పనులను జగన్ పూర్తి చేసి ఉంటే గండ్లు పడేవి కావు. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తేదికాదు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story