పాలకులారా.. మా భవిష్యత్ ఏంటి ? అంటూ రైతుల పిల్లలు ప్రశ్న

పాలకులారా.. మా భవిష్యత్ ఏంటి ? అంటూ రైతుల పిల్లలు ప్రశ్న
x
Highlights

మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి అట్టుడుకుతోంది. పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. అమరావతిలోనే రాజధానిని కొసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మందడంలో రైతుల...

మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి అట్టుడుకుతోంది. పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. అమరావతిలోనే రాజధానిని కొసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మందడంలో రైతుల దీక్ష కొనసాగుతోంది. కుటుంబాలతో సహా రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. చిన్న పిల్లలు కూడా నిరసనలో పాల్గొన్నారు. తాము ఏ రాజకీయ పార్టీలకు భూములు ఇవ్వలేదని ప్రజలు, ప్రభుత్వం కోసమే ఇచ్చామని రైతులు తెలిపారు. తమకు అన్యాయం చేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకులారా మా భవిష్యత్ ఏంటి ? అంటూ అమరావతి రాజధాని రైతులు పిల్లలు ప్రశ‌నిస్తున్నారు. తమ బంగారు భవిష్యత్ కోసం భూములు ఇస్తే రాజధాని తరలించి అన్యాయం చేస్తారా ? అంటూ నిరసలకు దిగారు. తుళ్లూరు దగ్గర నిర్వహిస్తున్న రైతుల దీక్షలో భూమిలిచ్చిన కుటుంబాల పిల్లలు కూడా నిరసనకు దిగారు. తమకు అన్యాయం చేయవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories