Weddings: మాఘమాసం వచ్చింది..మోగనున్న పెళ్లి బాజాలు..రేపటి నుంచి ముహూర్తాలు

Dhivi
Updated on: 8 May 2025 3:07 PM IST
Wedding dates from January to May in the month of Magh
X

 Weddings: మాఘమాసం వచ్చింది..మోగనున్న పెళ్తి బాజాలు..రేపటి నుంచి ముహూర్తాలు 

Weddings: మాఘమాసం వచ్చింది. ఈ ఏడాది అధిక సంఖ్యలో పెళ్లి ముహూర్తలు ఉన్నాయి. ఈనె 31వ తేదీ నుంచి ఆ సందడి షురూ కానుంది. పెళ్లి, వధూవరులుతోపాటు ఎన్నో కుటుంబాల్లో సంతోషాలను నింపే ఘడియాలు వచ్చేశాయి. దాదాపు 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగానో, పరక్షంగానో ఉపాధినిస్తుంది. వచ్చే రెండు నెలల్లో సగానికిపైగ బడి రోజులు వివాహాలకు కల్యాణ మండపాలు ముందస్తుగా నమోదు అయ్యాయి. పురోహితులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, క్యాటరింగ్ , వస్త్ర వ్యాపారాలు, బంగారం, వెండి వ్యాపారాలు, అలంకరణ, రవాణా వాహన యజమానులు, మేళతాళాల ట్రూప్స్, డీజేలు, టెంట్ హౌస్ లకు ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్ లో భారీగా డిమాండ్ ఉంటుంది.

మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం అవడం వల్ల మాఘాది పంచకం అంటే మాఘ ఫాల్గుణ చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లో వివాహాది శుభకార్యాల ముహూర్తాలకు చాలా ప్రాధాన్యం ఉందని ప్రముఖ పురోహితులు చెబుతున్నారు.

పెళ్లి ముహూర్తాలు

జనవరి 31వ తేదీ,

ఫిబ్రవరి 2, 6, 7,8,12,13,14,16,20,22,23

మార్చి 1,2,6,7,12,14,15,16

ఏప్రిల్ 9,10,11,12,13,16,18,20,23

మే 1,7,8,9,10,11,14,15,16,17,18,21,22,23

Dhivi

Dhivi

Next Story